Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వర్చువల్‌గా సమావేశమై 26 జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 70 రెవిన్యూ డివిజన్లను ఏర్పాటుచేస్తారు. కొత్త జిల్లాలు: పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్‌ విజయవాడలను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. రెవెన్యూ డివిజన్లు: కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img