Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొత్త విద్యావిధానంపై సీఎం జగన్‌ సమీక్ష

కొత్త విద్యావిధానంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌ 44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతులను కల్పిస్తామన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img