Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగం

సీఎం వైఎస్‌ జగన్‌ కీలకనిర్ణయం
కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నియంత్రణ నివారణా చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సిబ్బంది నియామకాల్లో జాతీయ ప్రమాణాలను అనుసరించాలని, దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ను రూపొందించామని సీఎంకు అధికారులు తెలిపారు. అక్టోబరు 20న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీచేస్తామని అధికారులు తెలిపారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ ఇస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసుకుని డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు వెల్లడిరచారు. ఏపీవీవీపీలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌ 21`25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడిరచారు. ఈ సందర్బంగా నియామకాలపై అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img