Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోర్టు ధిక్కరణపై ఏపీ హైకోర్టు సీరియస్‌.. 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

క్షమాపణలు కోరడంతో వినూత్నంగా !
ఐఏఎస్‌లపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాలపాటు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఐఏఎస్‌ అధికారుల్లో విజయకుమార్‌, శ్యామలారావు, గోపాల కృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, బుడితి రాజశేఖర్‌, గిరిజా శంకర్‌, చిన వీరభద్రుడు, ఎం.ఎం నాయక్‌లు ఉన్నారు. దీంతో ఎనిమిదిమంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో వీరిని ఏడాది పాటూ ప్రతి నెలలో ఒకరోజు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. హాస్టల్స్‌ విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజనం ఖర్చు భరించాలని సూచించింది. అలాగే ఒకరోజు పాటూ కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img