Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘గంటా’ ఏమన్నా పెద్ద నాయకుడా.. లక్షల్లో ఒకడు: అయ్యన్నపాత్రుడు

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రుల మధ్య పోరు మళ్లీ స్టార్ట్‌ అయ్యింది. తాజాగా.. గంటా శ్రీనివాసరావుపై.. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానా? పార్టీలో అందరూ రావాలి.. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక’. అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.గంటా శ్రీనివాసరావు ఇన్ని రోజులు గప్‌చుప్‌గా ఇంట్లో దాక్కుని.. ఎన్నికలు వస్తుండగానే బయటకు వస్తున్నాడంటూ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటానే కాదు.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో బయటకు రాని నేతలందరికీ గట్టిగానే క్లాస్‌ పీకారు. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని.. అందుకే టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసిందన్నారు. త్వరలోనే టీడీపీ బీసీ నేతల సమావేశం ఉంటుందని.. 3 ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img