Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 24.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

తెలుగు రాష్ట్రాల్లో వానలు-వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. 100 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడు జులై నెలలో గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరద ప్రవాహంతో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. సాధారణంగా జులై నెలలో గోదావరికి వరదలు వచ్చినా … ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదు. జులై లో వరదలు వచ్చినా.. లక్ష క్యూసెక్కులలోపే ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్‌ చేశాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కి పైగా జిల్లాలు వరదలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నాయి.
20 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం నుండి గోదావరికి పోటెత్తుతోంది. ప్రస్తుతం గోదావరికి సంబంధించిన అన్ని ఉపనదుల నుండి వరదనీరు చేరుతోంది. కాళేశ్వరం ఆలయంలోకి వరదనీరు ప్రవేశించింది. ప్రాజెక్టు భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ నీటమునిగాయి. మిడ్‌మానేరు డామ్‌, శ్రీరామ్‌సాగర్‌, కడెంనారాయణరెడ్డి, శ్రీపాదసాగర్‌, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టుల నుండి భారీస్థాయిలో వరదనీరు విడుదలవుతూనే ఉంది.
భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నది ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో ప్రమాద స్థాయిని దాటి నది ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. వరద, సహాయక చర్యలు చేపట్టేందుకుసింగరేణి సీఎండీ శ్రీధర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకాధికారిగా నియమించింది. తక్షణమే జిల్లాకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌ షైనీ, హనుమంతరావును అదనపు ప్రత్యేక అధికారులగా నియమించింది.గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో దీంతో 22 ఏండ్ల క్రితం 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును బద్దలుకొట్టింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో 1986లో నమోదైన 75.63 అడుగుల అత్యధిక ప్రవాహ మట్టాన్ని సైతం అధిగమిస్తుందనే అంచనాలున్నాయి. ఎగువన ఉన్న పరిస్థితులను చూస్తుంటే 77 అడుగులు దాటి, కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img