Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నవంబర్‌ 1న వైఎస్సార్‌ అవార్డులు ప్రదానం చేస్తాం’ అని సీఎం వెల్లడిరచారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్‌ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రతి సంక్షేమ పథకంలో ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇచ్చామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని జగన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img