Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చంద్రబాబుకి పవన్‌ కల్యాణ్‌, దేవినేని ఉమ జన్మదిన శుభాకాంక్షలు

చంద్రబాబుతో కలిసి ఉన్న రేర్‌ ఫొటోను షేర్‌ చేసిన చిరంజీవి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందిస్తూ… మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘పట్టిసీమతో గోదావరి తల్లిని కృష్ణమ్మ చెంతకు చేయిపట్టి నడిపించిన అపర భగీరథుడు, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన కర్త చంద్రబాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా, గొల్లపూడి వన్‌ సెంటర్‌ లో ఘనంగా చంద్రబాబు నాయుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని దేవినేని ఉమ చెప్పారు.
చంద్రబాబుకు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ‘నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు గతంతో చంద్రబాబుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img