Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదు : మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇది ప్రకృతి విపత్తు. ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది. తప్ప, ఇందులో ఎవరి తప్పులేదు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు మాపై విమర్శలు చేస్తున్నాడని అన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లాలో రోడ్లు, పంటలు 70-80 శాతం నష్టం వాటిల్లింది. వరద నష్టం అంచనా వేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img