Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు వదిలి వెళ్లిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,800 కోట్లు : మంత్రి ఆర్కే రోజా

ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించి చంద్రబాబు వదిలి వెళ్లిన రూ.1,800 కోట్ల బకాయిలను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెల్లిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు వదిలి వెళ్లిన బకాయిలను చెల్లించడమే కాకుండా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని రీతిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 5న సీఎం జగన్‌ శ్రీబాలాజి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తిరుపతిలో జరగనున్న జగన్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం రోజా పరిశీలించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులను చెల్లించకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆమె మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలని చంద్రబాబు చూస్తే.. సీఎం జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని రోజా చెప్పారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో రూ.28 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్‌ ఛార్జీలు పెంచారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img