Friday, April 19, 2024
Friday, April 19, 2024

చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాల సహాయ సహకారాలు


సీఎం జగన్‌
ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,చిన్న తరహా పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.ఈ తరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. తద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలని అన్నారు. కొప్పర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ను స్థాపిస్తున్నామని తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img