Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షలకు పెంచాలి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున

విశాలాంధ్ర-కళ్యాణదుర్గం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 వేలును 5 లక్షలకు పెంచాలని లబ్ధి దారులకు ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇవ్వాలని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. నియోజకవర్గ కార్యదర్శి గోపాల్,పట్టణ కార్యదర్శి ఓంకార్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ నాయకులు కలిసి బళ్లారి రోడ్డులోని గుబనపల్లి జగనన్న కాలనీలో సిపిఐ పోరు బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..అక్కడే ఉన్న విజయవాడ సూపర్డెంట్ ఇంజనీర్ నాగభూషణ, హౌసింగ్ డిఇ శైలజ, ఏఈ రామ్మోహన్ తో కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న జగనన్న ఇల్లు నాణ్యత పై చర్చించారు. లబ్ధిదారులతో సమావేశమై జగనన్న ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలని సంతకాలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, నివేశనస్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలన్నారు. జగనన్న కాలనీలో మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, నీళ్లు, సదుపాయాలు కల్పించాలన్నారు. టిడ్కో ఇల్లు లబ్ధిదారులతో కట్టించుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తాం అంటూ వాలంటీర్ల బెదిరింపులను ఆపాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు పునాదులుకు కూడా సరిపడడం లేదన్నారు. కాంట్రాక్టర్లు నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని, పొదుపు సంఘాలలో మహిళలు డబ్బులు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు నిర్మించిన ఇల్లు నాణ్యత పై ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. లబ్ధిదారుల పక్షాన ఫిబ్రవరి 6న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని, ఫిబ్రవరి 22న విజయవాడలో జరిగే మహా ధర్నాకు వేలాదిమంది లబ్ధిదారులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మనోహర్, రాము, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బుడెన్, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి హనుమంతు,ధను,సల్లవుద్దిన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img