Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

పిటిషన్‌ కొట్టివేత
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్‌ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్‌ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని, కేవలం వ్యక్తిగత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారని జగన్‌ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు రాఘరామ కృష్ణంరాజు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img