Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏఎన్‌యు గౌరవ డాక్టరేట్‌..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. యూనివర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఎన్వీ రమణకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ డాక్టరేట్‌ అందజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ.రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులు డాక్టరేట్లు అందుకున్నారు. నాగార్జున యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎన్వీ రమణ. విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసే త్యాగాలను మర్చిపోవద్దన్నారు. యూనివర్శిటీలో ఎన్నో జ్ఞాపకాలు తనకు ఉన్నాయన్నారు.. స్నేహితులతో కలిసి క్యాంటిన్‌ దగ్గర ఉండేవాళ్లమన్నారు. తాము చదువుకునే సమయంలో మూడు రేకుల షెడ్డులు మాత్రమే ఉండేవన్నారు. పాత రోజుల్లో చైతన్యం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. యూనివర్శిటీ తనకు తల్లి వంటిది అన్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు డాక్టరేట్‌ అందజేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img