Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కి 543 కోట్లు విడుదల

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి
జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్‌ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. మంగళవారం వైసీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏప్రిల్‌ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని చెప్పారు. 017లో జీఎస్టీ చట్టం అమలులోనికి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తాలను పూర్తిగా విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img