Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జూ.ఎన్టీఆర్‌ చెబితే మేం వింటామా..? : కొడాలి నాని

ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన సతీమణిపై కొందరు వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నందమూరి కుటుంబంతో సహా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. మహిళలపై అనుచిత వాఖ్యలు చేయడంపై స్పందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు మాట్లాడుతూ, కొడాలి నాని, వంశీలను ఎన్టీఆర్‌ కంట్రోల్‌ చేయలని, వాళ్లను హెచ్చరించాలని సూచించారు.దీంతో గురువారం మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చెబితే వింటాం కానీ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చెబితే వినేందేంటూ ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ తమను కంట్రోల్‌ చేయడమేంటిని ప్రశ్నించారు. తాను, వంశీ ఆయన శిష్యులమని వర్ల రామయ్య అనడం సరికాదని అన్నారు. తాను, వల్లభనేని వంశీ సెక్యూరిటీ తీసేసి వస్తామని.. చంద్రబాబు తీసేసి వస్తారా అంటూ సవాల్‌ విసిరారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగుజారుతారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని వేధించిన సోనియా గాంధీ నుంచి చంద్రబాబు, లోకేష్‌ వరకు అందరూ సర్వనాశనమైపోయారని కొడాలి నాని అన్నారు. వైఎస్‌ జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని.. ఇలాంటి వారి వేధింపులు ఏం చేయలేవన్నారు. భార్యను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం హేయనీయమని చంద్రబాబును విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రచ్చబండకు వెళుతూ మరణించారని.. ఆయన ప్రజా సేవే పరమావధిగా భావించారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి అంటూ విరుచుకుపడ్డారు. సింపతి, ఓట్ల కోసం తాపత్రాయపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img