Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టాలీవుడ్‌పై జగన్‌ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు

మంత్రి పేర్ని నాని
సినిమా టికెట్ల ధరలపై గతంలో హీరో నాని, సిద్దార్థ్‌లకు మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంగళవారం అమరావతిలో కీలక సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించిన అనంతరం మంత్రి మీడియా మీట్‌ నిర్వహించి వివరాలు వెల్లడిరచారు. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టాం. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదు. వీటిని రెన్యువల్‌ చేసుకోమని ఆనాడే చెప్పాము. అయినా అనుమతులు లేకుండా నడిపారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుందని అన్నారు. టాలీవుడ్‌పై జగన్‌ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదన్నారు. 130 సినిమా హాళ్ల పై చర్యలు తీసుకున్నాము. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాఓ 12 సీజ్‌ చేశాము. లైసెన్స్‌ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారు. 83 సీజ్‌ చేశాం, 23 థియేటర్లపై ఫైన్‌ వేశాం. జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాము. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరు లో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని అన్నారు. సిద్ధార్థ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సిద్ధార్థ్‌ ఇక్కడ ట్యాక్స్‌లు కట్టారా..?. మేం ఎంత విలాసంగా ఉంటున్నామో సిద్ధార్థ్‌ చూశాడా..?. స్టాలిన్‌, మోదీ కోసమో ఆయన ఆ మాటలు అనుంటాడు్ణ అని మంత్రి అన్నారు. ాసినిమా టికెట్‌ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు ప్రతిపాదనలు ఇచ్చారు. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లో అత్యధికంగా రూ.150, లోయర్‌ క్లాస్‌లో రూ.50 ఉండాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్‌ క్లాస్‌లో రూ.40 ఉండాలని కోరారు. సినీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంకు ఎవరి మీదా కోపం లేదు.. ఉండదు. రేట్‌లు రివ్యూ చేయడానికి కమిటీ వేశారు. అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావచ్చు.్ణ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img