Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. . మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ సవాంగ్‌ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎన్నో ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఒక కానిస్టేబుల్‌ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థ పైనే ఆరోపణలు వస్తాయని అన్నారు. మతాల మధ్య సామరస్యం కాపాడటం ముఖ్యమని చెప్పారు. కాగా, 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌, మెరైన్‌ పోలీస్‌ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img