Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డీనోటిఫై చేసిన భూములకు క్లియరెన్స్‌-సీఎం జగన్‌

అవనిగడ్డలో పర్యటిస్తున్నారు సీఎం జగన్‌.భూ సమస్యలకు చెక్‌ పెట్టనున్నారు. డీనోటిఫై చేసిన భూములకు క్లియరెన్స్‌ రానుంది.రాష్ట్ర వ్యాప్తంగా 35,600ఎకరాలకు చెందిన 22వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.భూములపై రైతులకు సర్వ హక్కులు ఉన్నాయన్నారు. నిషేధిత జాబితా 22-ఏలో ఉన్న భూములకు విముక్తి కలగనుంది. నిషేధిత జాబితా నుంచి డీనోటిపై చేసిన భూములకు క్లియరెన్స్‌ రానుంది.నవంబర్‌ లో 1500గ్రామాల్లో సర్వేపూర్తి చేసి హద్దులు నిర్ణయిస్తున్నామని జగన్‌ చెప్పారు. భూహక్కు పత్రాలు కూడా ఇస్తామన్నారు. ఈ మేరకు గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు.వచ్చే ఏడాది చివరికల్లా 17వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందన్నారు.భూ యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా భూముల పక్కా రికార్డులు లేవన్నారు. ఆధునిక టెక్నాలజీతో భూముల రీసర్వే చేస్తున్నాం. 15వేలమంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశామన్నారు. చుక్కల,అనాధీన భూములని నిషేధిత జాబితాలో ఉన్న వాటికి పరిష్కారం చేశామన్నారు సీఎం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img