Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తిరుపతి ఎస్వీ వర్శిటీలో చిరుతల కలకలం..

తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలు వర్శిటీలోకి చొరబడి పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మూడు చిరుత పులులు విద్యార్థినిల హాస్టల్‌ సమీపంలో సంచరించినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయ్యింది. ఈ విషయం తెలియండంతో హాస్టల్‌ విద్యార్థులు భయపడుతున్నారు. తాము హాస్టల్లో ఉండలేమంటూ యూనివర్సిటీ వీసి భవనం వద్ద ధర్నా నిర్వహించి వారి లగేజ్‌ తీసుకొని బయటకు వచ్చేశారు. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకునే వరకు తాము హాస్టల్‌కు వెళ్లేది లేదంటున్నారు. చిరుతల సంచారంతో అధికారులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి ఏడు గంటల తర్వాత బయటకు రావొద్దని హెచ్చరించారు. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వర్సిటీలో త్వరలో బోన్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో కూడా వెటర్నరీ యూనివర్శిటీలో చిరుతలు సంచరించాయి. కొద్దిరోజులుగా ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్‌ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయి. గతంలో యూనివర్శిటీ మెయిన్‌ బిల్డింగ్‌ దగ్గర చిరుత కుక్కలపై దాడికి ప్రయత్నించింది. చిరుతలు మళ్లీ ప్రత్యక్షం కావడంతో స్థానికులు కూడా వణికిపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img