Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృత అకాడమీ


రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌
తెలుగు, సంస్కృత అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా ఇంటర్‌ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం అని అన్నారు. ‘‘తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్‌ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి’’ అని అన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని తెలిపారు. తెలుగు అకాడమీతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ పనిచేస్తుందన్నారు. తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారని అన్నారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img