Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో, ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో ‘జవాద్‌’ తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. గంటకు 25 కి.మీ.ల వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది. తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఉత్తరకోస్తా తీరంలో 80 – 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img