Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తుపాను ప్రభావంపై అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్‌

తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడిరచారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, సీనియర్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల డీఎంహెచ్‌వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img