Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

తుపాన్‌ ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు

తుపాను ఎఫెక్ట్‌ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 3,4 తేదీల్లో రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img