Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలుగు రాష్ట్రాలతో ముగిసిన కేంద్ర హోం శాఖ సమావేశం

ఏ ఒక్క నిర్ణయం లేకుండానే ముగిసిన వైనం
ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన కీలక సమావేశం మంగళవారం ముగిసింది. ఢల్లీిలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్‌ శర్మ, సోమేశ్‌ కుమార్‌ల నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారుల బృందాలు హాజరయ్యాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. మొత్తం 14 అంశాలపై చర్చ జరిగేలా అజెండా రూపొందగా.. భేటీలో కొన్ని కీలక అంశాలు అసలు చర్చకే రాలేదని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం రేపుతున్న విద్యుత్‌ బకాయిల చెల్లింపుల అంశం ఈ భేటీలో చర్చకు రాలేదు. ఇక ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నలుగులుతున్న పలు సమస్యల్లో ఏ ఒక్క అంశానికి కూడా పరిష్కారం లభించలేదు. ఆయా అంశాలపై ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ అంగీకరించలేదు. అంతేకాకుండా ఎప్పటిమాదిరిగానే ఈ సమావేశంలోనూ ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలకే కట్టుబడి… రెండో వైపు వాదనలను వినేందుకు ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో సమావేశం ముగిసినట్లుగా కేంద్ర హోం శాఖ ప్రకటించింది. అయితే మరోమారు భేటీ కావాలా? వద్దా? అన్న అంశంపైనా స్పష్టత లేకుండానే ఈ భేటీ ముగిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img