Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక రేపటి వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మార్చి నెలల్లో బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం అరుదని.. గత 200 ఏళ్లలో ఇప్పటి వరకూ ఈ నెలలో 11 సార్లు మాత్రమే తుఫాన్లు ఏర్పడడానికి వాతావరణ అధికారులు చెప్పారు. ఇలా మార్చి నెలలో తుఫాన్‌ 1994లో తర్వాత ఇప్పుడే రావడమని తెలిపారు. అయితే ఈ ఇప్పుడు బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ పై అతి తక్కువగా ఉంటుందని తెలిపారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img