Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోదీ సమీక్ష..

పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌
దేశంలోని వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు కీలక దిశానిర్ధేశం చేశారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ జిల్లాల్లో ప్రగతిని వివిధ జిల్లాల కలెక్టర్లు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. . స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో పలు జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలను తొలగించాలని, సాంకేతికత, సృజనాత్మకతతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రధాని పిలుపునిచ్చారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎస్‌ సమీర్‌ శర్మ సహా తదితతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img