Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలోనే అతి పెద్ద డేటా సెంట‌ర్ : విశాఖ‌లో సీఎం జ‌గ‌న్

దేశంలోనే అతిపెద్ద డేటా సెంట‌ర్ విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు కానుండంటం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. విశాఖ ఐటీ పార్క్‌ నిర్మాణ పనులకు బుధ‌వారం సీఎం శంకుస్థాపన చేశారు. అదానీ గ్రూప్ ప్ర‌తినిధులు రాజేష్ ఆదానీ, కరన్ ఆదానీల‌తో క‌లిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ డేటా సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. విశాఖకు డేటా సెంటర్‌ రావడం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంద‌న్నారు. డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖకు వస్తోంద‌ని పేర్కొన్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్‌ దేశంలో ఎక్కడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. డేటా సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కృతజ్ఞతలు తెలిపారు. డేటా సెంటర్‌లో విశాఖ ఏ1 సిటీగా మారనుందని చెప్పారు. డేటా సెంటర్‌తో ఇంటర్‌నెట్‌ డౌన్‌ లోడ్‌ స్పీడ్‌ పెరుగుతుంద‌ని, విశాఖ వాసులకు డేటా సెంటర్‌ గొప్ప వరంగా మార‌బోతుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img