Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ధూళిపాళ్ల అరెస్ట్‌ అప్రజాస్వామికం : నారా లోకేష్‌

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మట్టి దొంగలను వదిలేసి… పోరాడే ధూళిపాళ్లను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. దోపిడీని ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్‌ అప్రజాస్వామికమని అన్నారు. ధూళిపాళ్లపై దాడి, అరెస్ట్‌ల వెనక మట్టి మాఫియా ఉందని ఆరోపించారు. జగన్‌ రెడ్డికి ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్‌ అని తేలిపోవడంతో వైసీపీ ప్రజా ప్రతినిధులు అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. అందుకే అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్‌ మాఫియాకు వైసీపీ అండదండలున్నాయని లోకేష్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ధూళిపాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైసీపీ అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ ‘చలో అనుమర్లపూడి’కి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ చలో అనుమర్లపూడికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతిలేదని అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img