Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిధులు రాగానే రోడ్ల రిపేర్లకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తాం

: మంత్రి జయరాం
ఏపీలో పలు చోట్ల రోడ్ల పరిస్థితి బాగోలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయని చెప్పారు. ఆగస్ట్‌ నెలలో రూ. 2 వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారని… నిధులు రాగానే ఆగస్ట్‌ 15 తర్వాత రోడ్ల రిపేర్లకు సంబంధించి పెండిరగ్‌ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img