Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : సీఎం జగన్‌

నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్‌, స్టీల్‌ అందజేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబర్‌ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. గతంలో టిడ్కో ఇళ్లపై పేదలు నెలకు రూ.3వేలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ, ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. మరో 63వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు.పతి మహిల చేతికి రూ. 5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img