Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం : కేంద్రం

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం కేంద్రం వెల్లడిరచింది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని తేల్చి చెప్పింది. సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘వచ్చే ఏప్రిల్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోంది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ప్రాజక్టు స్పిల్‌వే ఛానల్‌ పనులు 88 శాతం, అప్రోచ్‌ ఛానల్‌ ఎర్త్‌ వర్క్‌ పనులు 73 శాతం పూర్తయ్యాయి. పైలట్‌ ఛానల్‌ పనులు 34 శాతమే పూర్తయ్యాయి. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లకు టీఏసీ ఆమోదం తెలపడం నిజం.’ అని సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img