Friday, April 19, 2024
Friday, April 19, 2024

నెల్లూరులో కిడ్నాపైన చిన్నారి క‌థ విషాదాంతం..

నెల్లూరులో రెండ్రోజుల క్రితం ఇంటిలోని ఊయలలో మాయమైన ఏడాదిన్నర వ‌య‌సు గ‌ల‌ చిన్నారి హారిక క‌థ‌ విషాదాంతమైంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి సమీపంలోని సర్వేపల్లి కాలువలో శవమై తేలింది. బాలిక చిన్నారి కిడ్నాప్ అయిన వ్యవహారంపై పోలీసులు బంధువులను తమదైన రీతిలో విచారణ చేపట్టడంతో ఆ బాలిక విషాదాంతం వెలుగు చూసింది. రక్త సంబంధీకులే నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి సర్వేపల్లి కాలవలో పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి దాటాక గజ ఈతగాళ్ల ద్వారా సర్వేపల్లి కాలువలో గాలింపులు చేపట్టగా బాలిక డెడ్ బాడీ బయటపడింది. దీనిపై బాలాజీ నగర్ సీఐ నాయక్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img