Friday, April 19, 2024
Friday, April 19, 2024

నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి

సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
నైపుణ్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక కళాశాలను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీని పెట్టబోతున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌ యూనివర్శిటీలు రూపొందిస్తాయని వెల్లడిరచారు. కోడిరగ్‌, లాంగ్వేజెస్‌, రోబోటిక్స్‌, ఐఓటీలాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో బోధన, శిక్షణ ఉంటుందని వివరించారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతో వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ‘విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టండి. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి. తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలతో పాటు కొత్తగా నిర్మించనున్న వైద్య కళాశాలల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలి. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి.’ అని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలని,. నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందని చెప్పారు. ప్క్రెవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైన కూడా దృష్టిపెట్టాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img