Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటి నుంచి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిన్న కడపలో జోన్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నేడు గిద్దలూరుకు చేరుకుంటారు. అక్కడ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే రేపు మార్కాపురంలో చంద్రబాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. రేపు మార్కాపురం, ఎల్లుండి యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ అధినేత వస్తుండటంతో పెద్దయెత్తున జనసమీకరణకు నేతలు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img