Friday, April 19, 2024
Friday, April 19, 2024

నేటి నుంచి విశాఖ న‌గ‌రిలో జి 20 స‌దస్సు..

విశాఖ వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు- జి-20 సదస్సు నిర్వహించను న్నారు. దీనికి సంబంధిం చి అన్ని ఏర్పాట్లు- పూర్త య్యాయి. వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ,వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో..నగరంలోని రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో ఈ నెల 28,29,30వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచే వివిధ దేశాల నుంచి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సదస్సు ద్వారా విశాఖనగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు- చేశారు. విశాఖ బ్రాండ్‌ మరింత పెంచేలా..దేశం గర్వించేలా సదస్సును సర్వం సిద్దం చేసేవారు.మలివిడత జీ-20 శిఖరాగ్ర సదస్సుకు విశాఖనగరం అతిథ్యం ఇస్తోంది.40దేశాల నుంచి 200మంది వరకూ దేశవిదేశీ ప్రతినిధులు, పలుదేశాల ఆర్ధిక మంత్రులు, విదేశాంగ మంత్రులు,సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు- చేస్తున్నారు. వివిధ దేశాలనుంచి విశాఖవచ్చే అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు- చేశారు.అతిథుల రోజువారీ కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టారు.ప్రస్తుతం28,29,30తేదీల్లో మూడు రోజులు జీ-20శిఖరాగ్ర సదస్సులో పలు దేశాలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తూ తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img