Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పక్కా స్కెచ్‌తోనే రాహుల్‌ హత్య


కృష్ణా జిల్లాలోని విజయవాడలో సంచలనం రేపిన యువ వ్యాపారి రాహుల్‌ మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. రాహుల్‌ హత్య కేసులో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్‌ 302, 120బీ రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు రాహుల్‌ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏ1 గా కోరాడ విజయ్‌కుమార్‌, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా పద్మజ, ఏ4గా పద్మజ, ఏ5గా గాయత్రిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్‌.. రాహుల్‌ వ్యాపార భాగస్వాములని పేర్కొన్నారు. కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయని, తన వాటా 15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్‌పై విజయ్‌ ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. నిందితుడు విజయ్‌ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడని తెలిపారు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడని రాహుల్‌ కాలయాపన చేస్తుండటంతో పక్కా స్కెచ్‌తో హత్య చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img