Friday, April 19, 2024
Friday, April 19, 2024

పల్లెల పరిశుభ్రతకు పెద్దపీట

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
డిజిటల్‌ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌, డిజిటల్‌ లైబ్రరీలు అన్నీ కూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్‌ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలన్నారు. అలాగే గ్రామాల్లో 14వేల ట్క్రెసైకిళ్లు ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్‌ వేస్టేజ్‌ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img