Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పసుపు పంట ధర పతనం

గోదాములు , ఇళ్లలోనే నిల్వలు
కరోనా దెబ్బతో ఆగిపోయిన ఎగుమతులు
ఆందోళనలో రైతులు

విశాలాంధ్ర, చాగలమర్రి : గత ఏడాది పండిరచిన పసుపు దిగుబడి ఇళ్లలో , గోదాముల్లో నిల్వ ఉంది. కొనేవారు రాక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్న వంగలి, పెద్దవంగలి , ముత్యాలపాడు , గొడిగనూరు తదితర గ్రామాల్లో 3 వేల క్వింటాళ్ల దాకా పసుపు బస్తాలను ఇళ్లలో నిల్వ ఉంచుకున్నారు . పసుపు ధర పతనం కావడంతో రైతులు అమ్ముకోలేక పోతున్నారు. సీజన్‌ ప్రారంభమై 50 రోజులు గడిచినా ఇదే పరిస్థితి. మార్క్‌ ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు రూ .6,100 ధర ప్రకటించి కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
పతనమైన ధర ..
పదేళ్ల క్రితం పసుపు క్వింటా రూ .17 వేలు ధర పలికింది. ఆ తర్వాత మూడేళ్లపాటు క్వింటా రూ .10 వేల నుంచి రూ .12 వేలు మూడేళ్ల పాటు నిలకడగా ఉండేది . నాలుగేళ్ల నుంచి క్వింటా రూ .5 వేలకు మించి పెరగడం లేదు. 9 నెలలపాటు కష్టపడి పసుపు పంటను పండిస్తారు. ఎకరాకు సుమారు రూ .1.20 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే దిగుబడి కూడా అంతంత మాత్రమే వస్తుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పుకుంటుందే తప్ప పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పసుపును అమ్ముకోలేక కడప , ప్రొద్దుటూరు ఏసీ గోదాముల్లో , ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారాలు ఆగిపోయాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. అయితే ఇంతవ రకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా పసుపు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
పసుపును ఎగుమతి చేయాలి…
గత నాలుగేళ్లుగా పసుపు ధర రూ .5 వేలు పలుకుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. మార్క్‌ ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు అన్నారు. ప్రస్తుతం క్వింటం రూ5 వేలు పలుకుతోంది. ఇంత తక్కువ ధరకు అమ్మితే నష్టపోతాం. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img