Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాలనా వికేంద్రీకరణ పైనే ఎక్కువగా దృష్టి

ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌
నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. గడిచిన మూడేళ్లుగా పాలనా వికేంద్రీకరణ పైనే తమ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ అన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాలని అన్నారు. అందుకే ఉద్యోగుల వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని గవర్నర్‌ తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img