Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెగాసెస్‌పై ముగిసిన హౌస్‌ కమిటి భేటీ

పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ సమావేశం ముగిసింది. హోమ్‌, ఐటీ శాఖల నుంచి హౌస్‌ కమిటీ సమాచారం సేకరించింది. ఈ క్రమంలో డేటా చౌర్యం జరిగిందని కమిటీ నిర్థారణకు వచ్చింది. దీని వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉందని, గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కుట్ర జరిగిందని గుర్తించింది. 2016 నుంచి 2019 వరకు ఓట్లను తొలగించే ప్రక్రియ జరిగిందని, 40 లక్షల మంది ఓట్లను తొలగించే కుట్ర చేశారని హౌస్‌ కమిటీ పేర్కొంది. చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ, సేవా మిత్ర యాప్‌ ద్వారా సర్వే పేరుతో ఓటర్లను తొలగించే ప్రయత్నం చేశారని తెలిపారు. డేటా చౌర్యం జరిగిందని స్పష్టం చేశారు. తమకు ఓటు వేయరు అనుకునే వారిని తొలగించే కుట్ర చేశారన్నారు. అవసరం అయితే కొంతమందిని కమిటీ ముందుకు పిలుస్తామని భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img