Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదే

: మంత్రి పేర్నినాని

ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయని..ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదేనని అన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.115కు తీసుకెళ్లి తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, ఢల్లీిలో ఎందుకు పన్నులు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢల్లీిలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్‌ చేయాలి. సెస్‌ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే తాను కూడా ఢల్లీి వస్తా అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచిందని అన్నారు.. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నేతలు.. టీడీపీ స్క్రిప్ట్‌ను చదవడం కాదని, అందరూ వస్తే పెట్రో ధరలపై పార్లమెంట్‌ దగ్గర ధర్నా చెద్దామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img