Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలీసు వలయంలో విజయవాడ…

నగరంలో 144 సెక్షన్‌ అమలు !
సీఎం కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయుల పిలుపు
విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పోలీసుల మోహరింపు

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇవాళ ‘చలో సీఎంవో’ ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో 144 సెక్షన్‌ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు.దావులూరు, పొట్టిపాడు, కాజా చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. రైలు, రోడ్డు మార్గాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ, గుంటూరుకు చేరుకోకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా ఉంచారు. సెల్‌ ఫోన్లు, ఐడీ కార్డులు చెక్‌ చేసి పంపుతున్నారు. అనుమానం ఉన్న ప్రయాణికుల సెల్‌ఫోన్లను తీసుకుని ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపులతో సభ్యులుగా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఉద్యోగిగా నిర్థారణ అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారధి నుంచి కాజా టోల్‌గేట్‌ మధ్య ఎక్కడా ఆపొద్దని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఆదేశాలిస్తున్నారు. రోబో పార్టీ స్పెషల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దావులూరు చెక్‌ పోస్ట్‌ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. యూటీఎఫ్‌ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొద్దిరోజలు క్రితం ఉద్యోగ సంఘాల ‘చలో విజయవాడ’ సందర్భంగా ఉద్యోగులు వివిధ జిల్లాల నుంచి పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులూ మారువేషాల్లో వస్తారేమో అన్న అనుమానంతో బస్సులు, రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img