Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్యాసింజర్‌ రైళ్ల రద్దు మరోసారి పొడిగింపు

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
పలు ప్యాసింజర్‌ రైళ్లను రద్దును పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పొడిగించింది. గతంలో తీసుకున్న నిర్ణయం ఇవాళ్టితో ముగియనుంది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున జనవరి 31 వరకుపొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలతో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లలో సికింద్రాబాద్‌, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కలబుర్గి , చెన్నై వంటి ప్రధాన స్టేషన్ల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ఇందులో చిత్తూరు- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- చిత్తూరు, కాజిపేట్‌-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ కాజిపేట్‌. ఇలా మొత్తం 55 సర్వీసులను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img