Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం : సీఎం జగన్‌

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు మేలు చేసే ప్రాజెక్టు వెలిగొండ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని జగన్‌ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.ఈసందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..వెలిగొండ మొదటి టన్నెల్‌ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మారుస్తామన్నారు. పేదలు, రైతులు సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్‌ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్‌ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా వైఎస్‌ఆర్‌ పేదలకు చదువు అందించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img