Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల్లోకి వెళ్లే దిశగా అడుగులు వేయాలి

ఎమ్మెల్యేలకు జగన్‌ దిశానిర్దేశం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.జులై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 10 కల్లా గ్రామస్థాయిలో ఉపాధిహామీ సహా అన్ని బిల్లులనూ చెల్లిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు చెల్లిస్తామని, ఉగాదిన వాలంటీర్లకు సన్మానం, అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రతినెలా 10 సచివాలయాలను సందర్శించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గ్రామాల్లో 20 రోజులపాటు బూత్‌ కమిటీలు తిరగాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లే దిశగా అడుగులు వేయాలి. గడపగడపకు వెళ్లడం కన్నా మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదు. కనీసం 3 సార్లు డోర్‌ టూ డోర్‌ కార్యక్రమం చేపటాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img