Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి : సీఎం జగన్‌

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో రక్తం, నీరు, గాలి ఈ మూడిరటిపైన పరీక్షలు జరగాలని సీఎం సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులోకి ఉండాలన్నారు. అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్‌ పరిస్థితులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా శిశు మరణాలను తగ్గించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా కేసులు పెరగకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు విష జ్వరాలను కూడా ఆరోగ్య పరిధిలోకి తీసుకువస్తున్నట్లు మంత్రి నాని చెప్పారు.ప్రస్తుతం విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్‌ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. థర్డ్‌వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img