Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వంతో చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
ఉద్యోగులతో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమన్నారు. ‘ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉద్యోగుల కోసం ఎదురు చూసాం. వ్యక్తిగతంగా కూడా రమ్మని పిలిచాం. ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుంది. టీవీల ద్వారా పరిష్కారం జరగదు. సమ్మె చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. రేపటి నుండి కూడా మేము అందుబాటులో ఉంటాము. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తాం. వాళ్ళు శత్రువులు కాదు.. మా ఉద్యోగులే’ అని సజ్జల తెలిపారు. ఆరి డిమాండ్లను సీఎంతో చర్చించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వచ్చి చర్చిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు మరో ప్రత్యామ్నాయం ఏముందని సజ్జల ప్రశ్నించారు. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్‌ పాజిటీవ్‌ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు.ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img