Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రభుత్వంపై బురద చల్లడానికే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు : అంబటి

జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులు టీడీపీ జెండాలను ప్రదర్శించడాన్ని తప్పు పట్టారు.వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినట్టు లేదంటూ ఎద్దేవా చేశారు. ఈ ఉదయం ఆయన శ్రీశైలంలో పర్యటించారు. కృష్ణానదికి సంభవించిన వరదల వల్ల శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లను ఎత్తారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు పార్టీ జెండాలను కట్టుకుని వెళ్లారని గుర్తు చేశారు. ఇది ఆయనకు సిగ్గుచేటుగా అనిపించట్లేదా అంటూ నిలదీశారు.తమ ప్రభుత్వంపై బురద చల్లడానికే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తోన్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, ఈ సంవత్సరం కూడా శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుందని అన్నారు. చంద్రబాబు పాలనలో వర్షాలు పడటం గానీ, గేట్లు ఎత్తడం గానీ జరగలేదని గుర్తు చేశారు. నదులు వరదనీటితో పోటెత్తుతున్నాయని, అన్ని ప్రాజెక్టులు నిండాయని చెప్పారు.పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే ప్రధాన కారకుడని ధ్వజమెత్తారు. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ ఎవరైనా నిర్మిస్తారా?.. అంటూ నిలదీశారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తయిన తర్వాతే డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు పదేపదే చెప్పినప్పటికీ.. పట్టించుకోలేదని అంబటి రాంబాబు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే పనులు వేగంగా పూర్తి కొనసాగుతున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img