Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలలో పదిమంది విద్యార్థులకు కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పున:ప్రారంభం అవ్వడంతో.. వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.చిన్నారులపై వైరస్‌ ప్రభావం పెరుగుతోంది.తాజాగా..ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ కలకలం రేపుతోంది. మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ర్యాండమ్‌ పరీక్షల్లో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. ఒక్క పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా అని తేలింది.అదే విధంగా మరో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు కూడా కరోనా సోకింది. దీంతో వెంటనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలకు ఎంఈవో సెలవులు ప్రకటించారు. అందరినీ హోం ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. మిగతా విద్యార్థులకూ టెస్టులూ చేయిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img